తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా గ్రామీణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల దత్తత

2022, 2023 సంవత్సరాలలో తెల్సా తెలుగు రాష్ట్రాలలో కొన్నిగ్రామీణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను దత్తత చేసుకునే కార్యక్రమం తలబెట్టింది. ఇంతకుముందు గుంటూరు జిల్లాలో ఒకపాఠశాలను దత్తత తీసుకుని, అక్కడ సోలార్ పవర్ ప్లాంటు, మంచి నీటిప్లాంటు, మరుగు దొడ్లకు నీటి సదుపాయం, స్కూలుబిల్డింగు మరమ్మత్తులు, లైబ్రరీ ఏర్పాటు, వైఫైహబ్బు ఏర్పాటు, Spoken English Centre ఏర్పాటు వగైరా పనులు చేయించడం జరిగింది.

ఇకపై దత్తత తీసుకోబోయేచోట కూడా – పాఠశాల సిబ్బంది (విద్యార్థులందరికీ ప్రయోజనకరమని, అత్యవసరమని) గుర్తించిన పనులు చేపట్టి, విద్యార్థులకు చదువులలో ఆసక్తి పెంచి రాణించడాని కవసరమైన పరికరాలు, (సౌకర్యాలు, సదుపాయాలు) వీలైన మేరకు అమిరే ఏర్పాటు చెయ్యాలని ఉద్దేశం.

కనీసం 400మంది విద్యార్థులు, మంచి భవనము కల ఉభయరాష్ట్రాలలోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలు ఈ దిగువనున్న దరఖాస్తును సంపూర్ణ సమాచారంతో జూలై 31, 2022 లోపు మాకు పంపించగలరు.

Download Form (PDF)

Menu